నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు షాక్.. కవితను ఓడించిన బీజేపీ!

  • టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత అపజయం
  • బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు
  • 68 వేల ఓట్ల మెజార్టీ సాధించిన అరవింద్
నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమిపాలయ్యారు. కవితపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. 68 వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు. కాగా, ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఎన్నికల ప్రచార సమయంలో కవిత ధీమాగా చెప్పారు. ఇందుకు భిన్నంగా ప్రజల తీర్పు వెలువడటంతో ఆమె ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 
Go Back to Shorts
Nizamabad District
TRS
kavitha
bjp
dharmapuri

More Telugu News